తితిదే అటవీ విభాగం నియమనిష్టలతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల చాపను.. 205 అడుగుల తాడును దర్భతో తయారు చేస్తారు. ధ్వజారోహణం సమయంలో ఆలయంలోని ధ్వజ స్తంభానికి చాపను చుడుతారు. తాడుతో ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. శనివారం సాయంత్రం 6 నుంచి 6:30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించి.. బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానిస్తారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
శ్రీవారి ఆలయానికి దర్భతో తయారు చేసిన చాప, తాడు
బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం కార్యక్రమంలో వినియోగించేందుకు దర్భతో తయారు చేసిన చాపను, తాడును శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
tirumala srivari brahmostavalu 2020