తిరుపతిలో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూతోపాటు మధ్యాహ్నం నుంచి స్వచ్ఛంద కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇది శ్రీవారి దర్శనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండటంతో ఇప్పటికే కొంత మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. దర్శనం బుక్ చేసుకున్న భక్తులు ప్రస్తుతం తిరుమలకు తమ సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకుంటున్నారు. రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తే అత్యవసర సేవలు మినహా మిగిలిన పనుల కోసం ప్రజలను అనుమతించరు. సొంత వాహన రాకపోలను నిలిపివేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల దర్శన టికెట్ల ఆధారంగా అనుమతించే అవకాశం ఉందా లేదా అనే విషయంపై ప్రస్తుతం భక్తుల్లో సందిగ్ధత నెలకొంది.
తితిదే ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కరవు