ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్పవాలు నేటితో ముగియనున్నాయి. నిన్న రాత్రి నిర్వహించిన అశ్వవాహన సేవతో వాహన సేవలు ముగిశాయి. ఇవాళ చక్రస్నాన కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్లకు చక్రస్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.

నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

By

Published : Sep 27, 2020, 5:20 AM IST

సాదారణంగా బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజున శ్రీవారికి రథోత్సవం నిర్వహిస్తారు. కానీ కరోనా నిబంధనల కారణంగా వాహనసేవలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తోన్న తితిదే... రథోత్సవం ఆలయంలో నిర్వహించేందుకు వీలు లేనందున... రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనసేవను నిర్వహించారు. ఆఖరి వాహనసేవైన అశ్వవాహన సేవను... వేడుకగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడతైన స్వామివారు... అశ్వవాహనంపై కల్కి అవతారంలో దర్శనమిచ్చారు.

బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నాన కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవ మూర్తులకు, శ్రీవారి చక్రతాళ్వార్లకు......స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. స్నపన తిరుమంజనం పూర్తైన తర్వాత శ్రీవారి చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహిస్తారు. అందుకోసం ఆలయంలోని అమల్‌లో తొట్టిని నిర్మించారు.

ఇదీ చదవండి:'నా దగ్గర ఏం లేవు.. ఒక్క కారు మాత్రమే వాడుతున్నాను'

ABOUT THE AUTHOR

...view details