తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు చెన్నై నుంచి గొడుగులు ఊరేగింపుగా బయలు దేరాయి. చెన్నైలోని చెన్న కేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బయలు దేరిన గొడుగులకు చెన్నై పుర వీధుల వెంట పుర ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో దర్శించుకుని ప్రణమిల్లారు. లక్షలాది మంది ప్రజలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాత్రంతా చెన్నైలో ఊరేగిన గొడుగులు గరుడోత్సవం రోజు స్వామి వారి గరుడ వాహన సేవలో పాల్గొంటాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తరలిన శ్రీవారి గొడుగులు
కన్నుల పండువగా జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే గొడుగులు చెన్నై నుంచి బయల్దేరాయి. గరుడోత్సవం రోజు స్వామి వారి గరుడ వాహన సేవలో పాల్గొననున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి ఊరేగింపుగా గొడుగులు
ఇవీ చూడండి-అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధం