ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ ఆదేశం: తితిదేలోకి మళ్లీ రమణదీక్షితులు

గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడి హోదా నుంచి తప్పుకున్న మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరలా తితిదేలోకి రానున్నారు. ఆయన సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు ఆయనను ఆగమ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రమణ దీక్షితులు

By

Published : Nov 5, 2019, 10:06 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులు నియమితులయ్యారు. సీఎం జగన్‌ ఆదేశాలతో తితిదే తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తించారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయన శ్రీవారి ఆలయ విధులకు దూరమయ్యారు. తాజాగా సీఎం జగన్ ఆదేశంతో మళ్లీ ఆయన్ను తీసుకున్నారు. ఓ వైపు ఆగమ సలహాదారుడిగా ఉంటూనే యువ అర్చకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను రమణదీక్షితులు నిర్వర్తించనున్నారు.గతనెల23న జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం మేరకు ఆగమ సలహాదారుగా నియమిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details