ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆదాయం సృష్టించకపోగా.. ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చారు' - వైకాపా ప్రభుత్వంపై వంగలపూడి అనిత కామెంట్స్

గడచిన 20 నెలల వైకాపా పాలనలో రూపాయి ఆదాయాన్ని సృష్టించకపోగా.. ప్రజలు ఆకలితో ఆత్మహత్యలు చేసుకొనే స్థితికి తీసుకువచ్చారని తెదేపా మహిళానేత వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిప్డడారు.

dp vangalapudi anitha comments on jagan govt
ఆదాయం సృష్టించకపోగా..ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చారు

By

Published : Apr 6, 2021, 4:51 PM IST

రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెంచి వైకాపా ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. గడచిన 20 నెలల కాలంలో రూపాయి ఆదాయాన్ని సృష్టించకపోగా.. ప్రజలు ఆకలితో ఆత్మహత్యలు చేసుకొనే స్థితికి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు.

సంక్షోభంలోనూ డబ్బులు ఎలా దండుకోవటం అన్నది.. సీఎం జగన్​కు బాగా తెలిసిన విద్య అని దుయ్యబట్టారు. ఏ మోహం పెట్టుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details