తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే తొలిసారిగా సీఎం జగన్.. తిరుపతిలో రాజకీయ పర్యటనకు వస్తున్నారని మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థలు ఏం జరిగినా సీఎం జగన్ ప్రచారానికి రానవసరం లేదన్న వైకాపా నాయకులు... ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు.
తిరుపతిలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరని గతంలో జగన్ వ్యాఖ్యలు చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జగన్ రెండేళ్ల కాలంలో అసలేం అభివృద్ధి చేశారని ఓట్లడుగుతారని ప్రశ్నించారు. జగన్ తిరుపతి పర్యటనతోనే వైకాపా ఓటమి ఖరారయ్యిందని చెప్పారు.