ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫిబ్రవరి నుంచి హిందీ, కన్నడ భాషల్లోనూ ఎస్వీబీసీ

తిరుమల అన్నమయ్య భవన్​లో ఎస్వీబీసీ 55వ పాలక మండలి శుక్రవారం సమావేశమైంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్​ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

svbc
svbc

By

Published : Nov 6, 2020, 8:04 PM IST

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్​(ఎస్వీబీసీ)ని హిందీ, కన్నడ భాషల్లోనూ ఫిబ్రవరిలో ప్రాథమికంగా ప్రారంభించాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయించారు. తిరుమల అన్నమయ్య భవన్​లో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ 55వ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సీఈవో సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్వీబీసీ ప్రసారాలకు సంబంధించిన పలు అంశాలపై పాలకమండలి సభ్యులతో ఛైర్మన్ చర్చించారు.

నవంబర్ 16 నుంచి డిసెంబర్ 14 వరకూ కార్తిక మాసం సందర్భంగా తితిదే నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్వీబీసీ హిందీ, కన్నడను ఫిబ్రవరిలో ప్రాథమికంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ఛైర్మన్... ఈ మేరకు లైసెన్స్​కు దరఖాస్తు చేయాల్సిందింగా సీఈవోకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్వీబీసీని హెచ్​డీ ఛానల్​గా మార్చాలని దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details