ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఒప్పంద ఉద్యోగులను పర్మినెంట్​ చేయడమే ధ్యేయం' - svbc

ఎస్వీబీసీలో పనిచేసే 270 మంది ఒప్పంద ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా చేయడమే తన ధ్యేయమని... దీనికై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకాడనని ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీ బాలిరెడ్డి తిరుపతిలో అన్నారు. తిరుపతి ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్'​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'ఒప్పంద ఉద్యోగులను పర్మెనంట్​ చేయడమే ధ్యేయం'

By

Published : Aug 16, 2019, 11:32 PM IST

'ఒప్పంద ఉద్యోగులను పర్మెనంట్​ చేయడమే ధ్యేయం'

తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) ఛైర్మన్​ పృథ్వీ బాలిరెడ్డి పాల్గొన్నారు. ఛానల్​లో పనిచేసే 270 మంది ఒప్పంద ఉద్యోగులను పర్మినెంట్​ చేయడమే తన ధ్యేయమని... దీనికోసం ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి కాళ్లు పట్టుకోవడానికీ వెనకాడనని అన్నారు. శ్రీవారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. శ్రీవారి లీలలతో కూడిన అంశాలను ఒక నిమిషం నిడివితో ప్రత్యేక లఘు చిత్రాలను చిత్రీకరిస్తున్నామని... ప్రముఖుల వ్యాఖ్యానంతో ఇవి రూపొందిస్తామన్నారు. ఎస్వీబీసీ యాప్ ద్వారా స్వామి వారి విశేషాలను భక్తులకు మరింత చేరువ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తిరుపతిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నానని... నెలలో ఇరవై రోజులు తిరుపతిలో ఉండి ఎస్వీబీసీ ద్వారా స్వామివారి చరిత్రను దశదిశలా వ్యాప్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details