ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బుధవారం నుంచి అందుబాటులోకి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు - srivari special darshanam tickets

శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తితిదే అధికారులు వెల్లడించారు.

srivari special darshanam  tickets available from wednesday
బుధవారం నుంచి అందుబాటులోకి రానున్న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు

By

Published : Jan 18, 2021, 10:41 PM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధిచిన కోటాను బుధవారం ఉదయం 9 గంట‌లకు తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. భక్తులు దర్శన టికెట్లతో పాటు గదులను పొందే విధంగా వెసులుబాటు కల్పిస్తోంది.

మ్యూజియం అభివృద్ధిపై సమీక్ష...

తిరుమ‌ల‌లోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. టాటా, టెక్ మ‌హింద్రా సంస్థ‌లు సంయుక్తంగా మ్యూజియం అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. భ‌క్తులు లోపలికి ప్ర‌వేశించ‌గానే స్వామివారి దివ్య‌వైభ‌వాన్ని వీక్షించి త‌రించేలా, ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో సూచించారు.

ఇదీ చదవండి

శ్రీవారి భక్తులను భయపెట్టిన భారీ నాగుపాము

ABOUT THE AUTHOR

...view details