ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీరామనవమికి శ్రీ వారి ఆలయంలో ఆస్థానం నిర్వహణ: తితిదే - tirupati news

ఈ నెల 21 న వస్తున్న శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తునట్లు తితిదే ప్రకటించింది. 22న శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

sriramanavami
శ్రీరామనవమికి శ్రీ వారి ఆలయంలో ఆస్థానం

By

Published : Apr 19, 2021, 3:47 PM IST

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ నిర్వహించి.. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను తితిదే ర‌ద్దు చేసింది. ఏప్రిల్ 22న శ్రీరామ పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వ‌హించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details