ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అక్రమ నిర్మాణాలు తొలగించి పేదలకు ఆవాసాలు కల్పిస్తాం'

తిరుపతిలో హథీరాం మఠానికి సంబంధించిన భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్థానిక తహశీల్దార్ స్పందించారు. కొందరు అక్రమార్కులు తక్కువ ధరకే భూములంటూ ప్రజలను మోసం చేశారన్నారు. మఠం భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఆవాసాలు కల్పిస్తామని చెప్పారు.

పేదలకు ఆవాసాలు కల్పిస్తాం'

By

Published : Aug 31, 2019, 6:48 PM IST

పేదలకు ఆవాసాలు కల్పిస్తాం'

తిరుపతిలో హథీరాం మఠానికి సంబంధించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయటం... తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించి....పేదలకు ఆవాసాన్ని కల్పిస్తామని తిరుపతి గ్రామీణ తహశీల్దార్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. కొందరు అక్రమార్కులు మఠం భూములను ఆక్రమించి.... తక్కువ ధరలకు అమ్మేసి ప్రజలను మోసం చేశారన్నారు. మఠం భూముల క్రయ విక్రయాలు చెల్లవన్న తహశీల్దార్... సర్వే నెంబరు 13లోని 108 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని...పేదల ఆవాసాలకు కేటాయిస్తామని చెప్పారు. స్థానికుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ.. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తున్న వ్యక్తులను గుర్తించామన్న ఆయన.. వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details