తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ అధ్యర్థి కె.రత్నప్రభ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు . ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేయడానికి భారీ స్థాయిలో ప్రజలు వచ్చారని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఓటేయడానికి వచ్చిన వారు తమ పేరు తండ్రి పేరు కూడా చెప్పలేకపోయారన్నారు.
దొంగ ఓట్లు వేయించడానికి బస్సులో వేలాది మందిని తరలించినట్లు పేర్కొన్న ఆమె ఏపీ పరిపాలన యంత్రాంగం పోలీసు బారికేడ్లు, చెక్‌పోస్టులను తొలగించి తప్పడు మర్గంలో ఓటేయడానికి అవకాశం కల్పించారని తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఆర్వో, ప్రధాన ఎన్నికల కమిషనర్‌విఫలమయ్యారని.. ఈక్రమంలోనే కోర్టును ఆశ్రయించినట్లు రత్నప్రభ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలపై భారత ఎన్నికల సంఘానికి ఈనెల 17 న ఇచ్చిన వినతి ఆధారంగా విచారణ జరిపి నివేదిక సమర్పించేలా ఆదేశించాలని అభ్యర్థించారు.