ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల కొండపై వర్షం...ఇబ్బంది పడుతున్న యాత్రికులు

తిరుమల కొండపై గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. దీంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చల్లటి గాలులు విస్తుండటంతో కొండపై చలి తీవ్రత పెరిగింది.

Pilgrims struggling with rain on Tirumala hill
తిరుమల కొండపై వర్షం...ఇబ్బంది పడుతున్న యాత్రికులు

By

Published : Dec 6, 2020, 1:02 PM IST

తిరుమల కొండపై రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న జల్లులతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు వానలో తడుస్తున్నారు. శ్రీవారి దర్శనం ముగించుకున్న వారు... గొడుగులు, ప్లాస్టిక్​ కవర్లను ఆసరాగా చేసుకుని ఆలయం నుంచి గదులకు చేరుకుంటున్నారు. చల్లటి గాలులు వీస్తుండడంతో కొండపై చలి తీవ్రత పెరిగింది. అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షంతో జలాశయాల్లోకి నీరు చేరుతోంది. డ్యాంమ్‌లలో నీటి మట్టం చూసుకుంటూ...అప్పుడప్పుడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ కనుమ దారిలో అక్కడక్కడా రహదారిపై రాళ్లు పడుతున్నాయి. వర్షం కారణంగా కనుమ దారుల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని...వాహన దారులకు భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అభివృద్ధి పనులకు గిరిబిడ్డల డీపట్టా భూముల సేకరణ!

ABOUT THE AUTHOR

...view details