ప్రజలను పీడించి.. దోచుకునే పార్టీ వైకాపా అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ (pcc president sailajanath) విమర్శించారు. తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. కరెంట్ బిల్లులు పెంచడంతో పాటు చెత్త సేకరణకు పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైకాపా అని శైలజానాథ్ మండిపడ్డారు.
వైకాపా.. ప్రజలను దోచుకునే పార్టీ: శైలజానాథ్ - పీసీసీ శైలజానాథ్ తాజా వార్తలు
వైకాపా ప్రజలను దోచుకునే పార్టీ అని పీసీసీ చీఫ్ శైలజానాథ్ (pcc president sailajanath) విమర్శించారు. తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు.
వైకాపా.. ప్రజలను దోచుకునే పార్టీ: శైలజానాథ్
పరిపాలన అంటే అప్పులు తెచ్చి ఖర్చు చేయడమని జగన్ రెడ్డి భావిస్తున్నారని.. పరిపాలన అంటే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది అని ఆయనకు అర్థం కావడం లేదన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి అధికార అహంకారానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు.