చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను (flood affected areas chittoor district) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారిపై కొట్టుకుపోయిన స్వర్ణముఖి కాజ్వేను మంత్రి పరిశీలించారు. వరదల వల్ల ఎదురైన నష్టాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధ్వంసమైన కాజ్ వేకు వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టి, సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పక్కనే ఉన్న నక్కల వాగును పరిశీలించారు. గండిపడిన రాయల చెరువును మంత్రి పరిశీలించారు.
పూతలపట్టు మండలంలోనూ మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. చిట్టిపి రాళ్ల, పూతలపట్టు గ్రామాల పరిధిలో వరదలో కొట్టుకుపోయిన కల్వర్టులు, రోడ్లను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమయంలో ఆయన వెంట ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, అధికారులు ఉన్నారు.