ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం' - minister narayanaswami on educational sector

విద్యారంగంలో కీలక సంస్కరణలు చేసేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. జగనన్న గోరు ముద్ద, విద్యాదీవెన, అమ్మ ఒడి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలో నూతన ఒరవడి తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై తెదేపా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

minister narayanaswami
minister narayanaswami

By

Published : May 28, 2020, 9:59 AM IST

విద్యారంగంలో కీలక సంస్కరణలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మన పాలన- మీ సూచన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... విద్యారంగంపై అధికారులతో చర్చించారు. జగనన్న గోరు ముద్ద, విద్యాదీవెన, అమ్మఒడి కార్యక్రమాల ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చివేశామని నారాయణస్వామి చెప్పారు.

నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్ధాయిలో తీర్చిదిద్దేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్న నారాయణ స్వామి... ఈ నిర్ణయానికి తల్లిదండ్రుల నుంచి విశేష మద్దతు ఉందన్నారు.

విద్యారంగంలో పెనుమార్పులు: మంత్రి ధర్మాన

సీఎం జగన్ విద్యా రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖపై నిర్వహించిన సమావేశంలో సభాపతి తమ్మినేని సీతారాంతో కలిసి మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు.

ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కృష్ణదాస్ పేర్కొన్నారు. జిల్లాలో అక్షరాస్యత 62 శాతం ఉందన్న మంత్రి.. ఈ శాతాన్ని పెంచాల్సి అవసరం ఉందన్నారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

తెదేపా మహానాడు.. నేటి తీర్మానాలివే..!

ABOUT THE AUTHOR

...view details