రాష్ట్రంలో లాక్డౌన్ తరవాత ఆర్టీసీ సేవలు ప్రారంభం కానున్నాయి. సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తిరుపతి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు. అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
ఆన్లైన్ విధానంలో టికెట్ బుకింగ్‌ను ప్రోత్సహించే విధంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. బస్సుల్లో భౌతికదూరం పాటించే విధంగా సీటింగ్ విధానంలోనూ మార్పులు చేపడుతున్నామంటున్న ఆయనతో.. మరిన్ని వివరాలపై ఈటీవీ భారత్ ముఖాముఖి.