ఎన్నో ఏళ్ల నుంచి నిత్యపూజ.. భక్తుల స్పందన అంతంతే..!!
తిరుమల కొండ నిత్యం లక్షలాది మందితో కిటకిటలాడుతూ ఉంటోంది. ఏ పూజ మండపం చూసినా భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. కానీ ఇదే కొండపై ఎన్నో ఏళ్లుగా.. నిత్యం చేస్తున్న గోపూజ గురించి చాలామంది భక్తులకు తెలియదు. ఈ కార్యక్రమంలో ఉచితంగానే పాల్గొనే అవకాశం కల్పిస్తున్నా... భక్తుల నుంచి అంతగా స్పందన రావడం లేదు.
తిరుమలలో తెలియని పూజ
తిరుమల గిరిపై ప్రతి రోజు గోపూజను నిర్వహిస్తున్నా... భక్తులు ఇతర సేవలకు హాజరైనంతగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. గోపూజ సమయంలో కొంతమంది శ్రీవారి సేవకులో... లేక ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఒకరిద్దరు భక్తులు మాత్రమే హాజరవుతున్నారు. ఆలయ పాలక మండలి సరిగా ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.