తిరుపతిలో ఉచితంగా కూరగాయల పంపిణీ
లాక్డౌన్ సమయంలో పనులు లేని వారికి, పేదలకు, అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి, పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నాయి.
కరోనా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. తిరుపతిలో పల్లివీధి, బలిజవీధి, ప్రకాశం రోడ్డులలో తెదేపా కార్యకర్తలు 2వేల కిలోల కూరగాయలను ఇంటింటికీ తిరుగుతూ పంచిపెట్టారు. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమవుతున్న వారిని ఆదుకునేలా అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.