తిరుపతిలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వర్షం వచ్చిదంటే చాలు.. లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణం గగనమవుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో..ఇళ్లలోకి నీరు చేరుతోంది. మధురానగర్, లక్ష్మీపురం కూడలి, లీలామహల్ కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, అన్నపూర్ణ గుడి.. ఇలా ఏ ప్రాంతానికా ప్రాంతం.. నీటితో నిండిపోతోంది. ఇదిగో ఇలా.. ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు.
కొద్దిపాటి వర్షానికి ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. అధికారులు స్పందించట్లేదు. కనీసం కార్యాలయానికి వెళ్లే పరిస్థితి కాదు కదా.. ఇంటి నుంచి కాలు తీసి బయట పెట్టే అవకాశం కూడా లేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రం అది చేస్తాం... ఇది చేస్తాం అని వస్తారు. తర్వాత ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి సమయంలో వస్తే కదా.. మా కష్టాలు తెలిసేది! - బాధితులు
మధురానగర్‌లో 40 లక్షలతో మురికినీటి కాలువ నిర్మిస్తున్న నగరపాలక అధికారులు.. వరద నీరు వదలడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. ఫలితంగా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు ఇళ్లలోకి చేరుతోందని.. ప్రజలు వాపోతున్నారు.