తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా... నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం వరకూ పడుతోంది. శ్రీవారి నిన్నటి హుండీ ఆదాయం 2కోట్లు 87లక్షలుగా ఆలయ అధికారులు తెలిపారు. 87 వేల 663 మంది భక్తులకు వెంకటేశ్వరుని దర్శనం కలిగిందన్నారు.
తిరుమలలో రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు - tirumala
భక్తుల రద్దీతో తిరుమల కిటకిటలాడుతోంది. సాదారణ సర్వదర్శనానికి 24గంటల సమయం...నిర్దేశిత దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయం వరకూ పడుతోంది.
'తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ'