ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అతివేగం..వన్య ప్రాణులకు ప్రాణ సంకటం'

తిరుమల ఘాట్ రోడ్లలో నిత్యం మూగజీవాలు ప్రమాదాలు బారిన పడుతున్నాయి. అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలు వద్ద జింకలు, దుప్పిలు వేగంగా ప్రయాణించే వాహనాలకు అడ్డుగా వచ్చి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నాయి.

DEERS ACCIDENTS IN TIRUMALA
'అతివేగం..వన్యప్రాణులకు ప్రాణసంకటం'

By

Published : Mar 3, 2020, 12:45 PM IST

'అతివేగం..వన్యప్రాణులకు ప్రాణసంకటం'

తిరుమల కనుమ దారుల్లో నిత్యం వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నాయి. మొదటి కనుమ దారిలో ఏడో మైలు వద్ద జింకలు, దుప్పిలు రహదారికి సమీపంలోకి వచ్చి సంచరిస్తుంటాయి. జంతుప్రేమికులు వాటితో సరదాగా గడుపుతూ ఫోటోలు దిగుతున్నారు. ఇలా అవి రహదారి పక్కన తిరిగే సమయంలో ఒక్కోసారి వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలకు అడ్డుగా వచ్చి దెబ్బలు తగలడం గానీ, చనిపోవటం గానీ జరుగుతున్నాయి. ఇటీవల ఓ జింక ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. గమనించిన భక్తులు ఆ జింకను బ్రతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అలిపిరి నడకమార్గంలో ఏడో మైలు వద్ద జింకల పార్కులో ఉన్న వీటిని...కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. అవి భక్తులు పెట్టే చిరుతిండికి అలవాటుపడి రహదారిపైకి వచ్చి ప్రాణాలు వీడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details