తిరుమల శ్రీవారిని సీఎం జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద యడియూరప్పకు జగన్ స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో ఇరువురు ముఖ్యమంత్రులకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు.
శ్రీవారి సేవలో ముఖ్యమంత్రులు జగన్, యడియూరప్ప - శ్రీవారి సేవలో జగన్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
cm jagan, karnataka mc yadiyurappa in tirumala
యడియూరప్పకు శ్రీవారి శేష వస్త్రాన్ని జగన్ బహుకరించారు. ఇద్దరు సీఎంలకు శ్రీవారి తీర్థప్రసాదాలను తితిదే ఈవో సింఘాల్, ఛైర్మన్ సుబ్బారెడ్డి అందించారు. నాద నీరాజనం వేదికగా సుందరకాండ పారాయణంలో సీఎంలు పాల్గొన్నారు. అనంతరం కర్ణాటక అతిథి గృహాల భవనాలకు ఇరువురూ కలిసి శంకుస్థాపన చేశారు.
Last Updated : Sep 24, 2020, 10:19 AM IST