ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది: చంద్రబాబు - తిరుపతిలో చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలపై బాబు స్పందించారు. జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరమన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. తిరుపతి లోక్​సభ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. బాలాజీనగర్‌లో స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

chandrababu
chandrababu

By

Published : Apr 8, 2021, 8:42 AM IST

Updated : Apr 8, 2021, 11:22 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి వారం రోజుల పాటు తిరుపతి ఉపఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుమల చేరుకున్న చంద్రబాబు తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

రమణదీక్షితుల వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

రమణదీక్షితుల వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరం. దేవుడు దేవుడే.. మనిషి మనిషే.. మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై వ్యాఖ్యలు బాధాకరం. గతంలోనూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం సరికాదు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది- చంద్రబాబు

శ్రీ కృష్ణ అతిథి గృహం వద్ద తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవులు, సంధ్యారాణి చంద్రబాబు వెంటఉన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. బాలాజీనగర్‌లో స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు.. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. బి.పి.అగ్రహారం, సూపర్ బజార్, పెళ్లి మండపం మీదుగా బేరివారి మండపం వరకు ప్రచారం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయం వద్దే బస్సులో బసచేస్తారు. 9వ తేదీన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, 10వ తేదీన సూళ్లూరుపేట, 11వ తేదీన వెంకటగిరి, 12న సత్యవేడు, 13న గూడూరు, 14వ తేదీన తిరుపతి లో జరిగే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల బయల్దేరిన తెదేపా అధినేత చంద్రబాబు

ఇదీ చదవండి:కరోనా టీకా రెండో డోసు తీసుకున్న మోదీ

Last Updated : Apr 8, 2021, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details