తిరుమలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టకుండా అన్ని చర్యలనూ పరిశీలిస్తామని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి తిరుమలలోని జలాశయాలను పరిశీలించారు. తిరుమల నీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను మంత్రి అనిల్ కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన తర్వాత ఈ అంశంపై పరిశీలిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ తెలిపారు.
తిరుమలలో జలాశయాలను పరిశీలించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్
తిరుమలలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటించారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆయన మంత్రి అనిల్ కుమార్‌తో కలిసి తిరుమలలోని జలాశయాలను పరిశీలించారు.
central minister
తిరుమల దేశంలోనే ప్రత్యేకమైన ప్రదేశం. యాత్రికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇక్కడ నీటి అవసరం కూడా పెరుగుతోంది. కల్యాణి డ్యాం నుంచి ఇక్కడికి నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిన తర్వాత దీనిపై పరిశీలిస్తాం.- గజేంద్రసింగ్ షెకావత్ ,కేంద్ర జలశక్తి మంత్రి
ఇదీ చదవండి:అటల్ సొరంగాన్ని ప్రారంభించిన మోదీ
TAGGED:
తిరుపతి తాజా వార్తలు