గత రెండేళ్లుగా తిరుపతి ఐఐటీకి కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదనే విషయాన్ని ఆర్టీఐ నివేదిక స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన నాగ శ్రావణ్ కిలారు ఈమేరకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. ఐఐటీ తిరుపతి నిర్మాణం కోసం రూ.1074.40 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటి వరకు 552.51 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు దీనికి సమాధానంగా వచ్చింది. ఐఐటీ తిరుపతి విషయంపై, గత రెండేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆర్టీఐ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కోసం కానీ, త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కానీ కేంద్రాన్ని ఏమి అడగలేదని ఆర్టీఐ తన సమధానంలో వెల్లడించింది.
తిరుపతి ఐఐటీకి రెండేళ్లుగా నిధులివ్వని కేంద్రం..
గత రెండేళ్లుగా తిరుపతి ఐఐటీకి కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వడంలేదు. విజయవాడకు చెందిన నాగ శ్రావణ్ కిలారు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కోసం కానీ, త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కానీ కేంద్రాన్ని ఏమి అడగలేదని ఆర్టీఐ తన నివేదికలో తెలిపింది.
central government not giving funds for Tirupati IIT