తెల్లవారితే పెళ్లి...ఉదయం 5.30 గంటలకు వివాహ ముహూర్తం. ఇంట్లో అంతా హడావుడిగా పనులు చేస్తున్నారు. ఆ వివాహం ఇష్టంలేని వధువు రాత్రికి రాత్రే పెళ్లి వేదిక నుంచి పరారయ్యింది. పెళ్లికి ముందు పెళ్లి కూతురు కనిపించకుండా పోవడంతో వరుడు, అతని బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
Bride Escape : పెళ్లి ముందు పరారీ...మరోయువకుడ్ని వివాహమాడి ప్రత్యక్షం - మదనపల్లె వార్తలు
తెల్లవారితే పెళ్లి...ఇంట్లో అంతా హడావుడిగా పనులు చేస్తున్నారు. కానీ ఆ వివాహం ఇష్టంలేని వధువు రాత్రికి రాత్రే పెళ్లి వేదిక నుంచి పరారయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే...
పెళ్లి ముందు వధువు పరారీ...మరోయువకుడ్ని వివాహమాడి ప్రత్యక్షం
సీన్ కట్ చేస్తే పారిపోయిన పెళ్లి కూతురు మరో యువకుడ్ని వివాహం చేసుకుని పోలీసు స్టేషన్లో ప్రత్యక్షం అయ్యింది. విషయం తెలుసుకున్న వరుడి కుటుంబం వధువు, కుటుంబ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీ కోసం కుటుంబాల పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది.
ఇదీ చదవండి : వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!