చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న కె. బి. రాజేంద్రన్ ను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా ఉత్తర్వు జారీ చేశారు. ఏఎస్ఐగా పనిచేస్తున్న రాజేంద్రన్ పై కొంత కాలంగా అనేక ఆరోపణలు వచ్చాయి. విచారణ పేరుతో స్టేషన్కు తీసుకు వచ్చే అనుమానితుల వద్ద నుంచి నగదు డిమాండ్ చేయడం, బెదిరించడం, ఫిర్యాదుదారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం... ఆరోపణలు ఉన్నాయి .
అలాగే దొంగతనం కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడికి సంబంధించిన చరవాణి ద్వారా ... ఏకంగా జిల్లా ఎస్పీతో పాటు, మరో డీఎస్పీకి ఫోన్ చేసి పోలీసు శాఖకు సంబంధించిన పలు అంతర్గత విషయాలపై ఆరోపణలు చేశాడు. ఇలా పలు మార్లు చేయడంతో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఈ విషయంపై టూటౌన్ సీఐ యుగంధర్ను..విచారణ అధికారిగా నియమించారు. విచారణలో రాజేంద్రన్ పలు అవినీతికి చర్యలకు పాల్పడినట్లు తేలింది .