తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉపఎన్నికను రద్దు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని విమర్శించారు. పోలింగ్ కేంద్రాల నుంచి ప్రతిపక్ష ఏజెంట్లను గెంటివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు వేలల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని శైలజానాథ్ ఆక్షేపించారు.
తిరుపతి ఉపఎన్నికను రద్దు చేయాలి: శైలజానాథ్
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఎన్నికల కమిషన్ను కోరారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా ఉపఎన్నికల పోలింగ్ జరుగుతోందని అన్నారు.
APCC president sailajanath