ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బయటి వ్యక్తులు, వాహనాలు రాకుండా చర్యలు తీసుకున్నాం' - fake votes in tirupathi by elections

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్​ సజావుగా జరుగుతున్నాయని అన్నారు. బయటి వ్యక్తులు, వాహనాలు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అనుమానితులపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు.

Andhra pradesh dgp on  tirupathi by elections
Andhra pradesh dgp on tirupathi by elections

By

Published : Apr 17, 2021, 3:27 PM IST

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని డీజీపీ తెలిపారు.

సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. బయటి వ్యక్తులు, వాహనాలు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే 250కి పైగా వాహనాలు తిప్పి పంపామన్నారు. ఇప్పటివరకు 33,966 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. రూ.76.04 లక్షలు, 6,884 లీటర్ల మద్యం సీజ్‌ చేశామన్నారు. 94 వాహనాలను జప్తు చేశామన్నారు. అనుమానితులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సమస్య వస్తే డయల్‌ 100, 112కి సమాచారం ఇవ్వాలని డీజీపీ గౌతమ్​ సవాంగ్ అన్నారు.

ఇదీ చదవండి: దొంగ ఓటర్లను పట్టుకున్న తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి

ABOUT THE AUTHOR

...view details