తిరుమల శ్రీవారికి ఈ-బైక్ బహుకరణ - e bike
శ్రీవారికి ఈ బైక్ను బహుమతిగా ఇచ్చాడో భక్తుడు. తన సంస్థ నుంచి తయారైన తొలి వాహనాన్ని తితిదేకి అందజేశారు.
ఈ బైక్
తిరుమల శ్రీవారికి బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన విటేక్ అనే సంస్థ తయారు చేసిన తొలి బ్యాటరీ వాహనాన్ని తితిదేకు అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు దీనికి పూజలు నిర్వహించారు. అనంతరం సంబంధిత దస్త్రాలను ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. పర్యావరణాన్ని కాపాడే ఈ నూతన వాహనాలను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ఛైర్మన్ తెలిపారు.