రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. తెదేపా స్టార్ క్యాంపెయినర్ మంత్రి లోకేశ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం నిర్వహించారు.
పలాసలో లోకేశ్ బైక్ ర్యాలీ
By
Published : Mar 26, 2019, 4:07 PM IST
పలాసలో లోకేశ్ బైక్ ర్యాలీ
తెదేపా స్టార్ క్యాంపెయినర్మంత్రి నారా లోకేశ్ పార్టీ తరఫున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మందస మండలం హరిపురంలో రోడ్‌షోకు హాజరయ్యే ముందు పలాసలో కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహనంపై ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ ర్యాలీకి యువత భారీగా హాజరైంది.