REMAND: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు.. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించారు. నేటితో రిమాండ్ ముగియడంతో పోలీసులు ఎస్కార్ట్ సాయంతో అనంతబాబును కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్ గడువు పెంచడంతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను.. గత నెల 17న కోర్టు కొట్టి వేసింది.
ఎస్పీ చెప్పింది ఇదీ: ఈ నెల 19న రాత్రి 8.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం ఆయన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకొచ్చారు. కొండయ్యపాలెంలోని నవభారత్ స్కూల్ ప్రాంగణంలో రాత్రి 10.15 వరకూ మద్యం తాగారు. ఆ సమయంలో కారులో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చూసి తనతోపాటు వాహనంలో తీసుకెళ్లారు.