ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దిశ చట్టం... ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి?' - disha act in ap news

రాజమహేంద్రవరంలో బాలికపై సామూహిక అత్యాచార ఘటన అమానుషమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

By

Published : Jul 20, 2020, 12:29 PM IST

రాజమహేంద్రవరంలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు బాధితురాలని చిత్రహింసలకు గురిచేసిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిశ చట్టం ఇంకా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు.

తన కుమార్తె ఆచూకీ తెలియటం లేదని బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని తెలిసింది. మహిళలపై అత్యాచారాలు నిరోధానికి తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైపోయింది?. తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమహేంద్రవరంలోనే సామూహిక అత్యాచార ఘటన జరిగింది. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి?. చట్టం చేయటం కాదు.. వాటిని నిబద్ధతతో అమలు చేయాలి- పవన్ కళ్యాణ్

ABOUT THE AUTHOR

...view details