తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం వులిశెట్టివారి పాలెంలో వులిశెట్టి వారి కుటుంబాలు ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశాయి. హైదరాబాద్, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు తదితర ప్రాంతాల నుంచి వులిశెట్టి వారి కుటుంబాలు ఈ ఆత్మీయ కలయికలో పాల్గొన్నాయి. ఆత్మీయ అనురాగాల మధ్య వారంతా హాయిగా గడిపారు. గతంలోని తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఎంత దూరంలో ఉన్నా ఇలా ఆత్మీయ కలయిక పేరుతో మనమంతా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. పిల్లలకు పెద్దలను పరిచయం చేసుకుంటూ మమతానురాగాలను చాటారు.
మూడు తరాల ఆత్మీయ కలయిక.. తీపి జ్ఞాపకాలతో పరవశం - పి.గన్నవరం మండలం తాజా వార్తలు
ఎక్కడ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా కుటుంబీకులు, బంధువులతో కలిసి ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతాం. అయితే నేటి సాంకేతిక యుగంలో పలకరింపులన్నీ చరవాణీల ద్వారానే జరుగుతున్నాయి. కానీ మన అనుకున్న వాళ్లంతా ఒక్క దగ్గర చేరితే.. ఆ ఆనందమే వేరు. అలాంటి ఆత్మీయ కలయికే తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో జరిగింది. దాదాపు మూడు తరాలకు చెందిన వారంతా ఒకేచోట చేరి తీపి జ్ఞాపకాలను పంచుకుంటూ పరవశించి పోయారు. అదెక్కడో తెలుసుకోవాలనుందా.. చదివేయండి మరి..!
మూడు తరాలు ఆత్మీయ కలయిక
ఈ ఆత్మీయ కలయికకు స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు కుటుంబ వ్యవస్థను, బంధుత్వాలను పటిష్టం చేస్తాయని ఆయన అన్నారు. నేటి సాంకేతిక యుగంలో ఇలాంటి ఆత్మీయ కలయికలు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టి బాబును వులిశెట్టి కుటుంబీకులు ఘనంగా సత్కరించారు.
ఇదీ చదవండి: ఘనంగా బొండాడ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక