మెుట్టమెదటిగా నేను ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పే మాట ఏంటంటే.. మీరు కూడా మాస్క్ పెట్టుకోండి. ఎక్కడా మాస్క్ పెట్టుకున్నట్లు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రదేశం శానిటైజ్ చేస్తారు.. వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు.. అని భావించినప్పటికీ.. శ్రేష్ఠుడు అనే వ్యక్తి చేసిన పనిని జనాలు అనుకరిస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రే నెంబర్ వన్. శానిటైజ్ చేసినా... ప్రజలు చూస్తున్నారు కాబట్టి మాస్క్ పెట్టుకోవడం అవసరం.
- ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ
ముఖ్యమంత్రి గారూ.. ముందుగా మీరు మాస్క్ పెట్టుకోండి: ఉండవల్లి - సీఎం జగన్ మాస్క్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మాస్క్ పెట్టుకోవాలని హితవు పలికారు.
undavalli arunkumar suggestion to cm jagan over wearing mask