ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ప్రధాన వార్తలు

.

Top News @ 5 PM
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jun 7, 2021, 5:01 PM IST

Updated : Jun 7, 2021, 5:23 PM IST

  • కేజ్రీవాల్‌కు రఘురామ లేఖ

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సెక్షన్‌ 124ఎ రద్దుకు ఆప్‌ సభ్యులు డిమాండ్ చేయాలని కోరారు. మే 14న ఏపీ సీఐడీ పోలీసులు తనను క్రూరంగా హింసించారని లేఖలో ప్రస్తావించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • డిప్యూటీ తహసీల్దార్​లకు మేజిస్ట్రేట్ అధికారాలు

డిప్యూటీ తహసీల్దార్ల(deputy tahsildar)కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (special executive magistrate ) అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న శాశ్వత భూ హక్కు (YSR Jagananna Shaswata Bhoo Hakku), భూ రక్షా పథకం (Bhu Raksha Scheme) అమలులో వివాదాల పరిష్కారం కోసం నియమించిన డిప్యూటీ తహసీల్దార్​లకు మాత్రమే ఈ అధికారులను ఇచ్చారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • డాక్టర్ వైద్యానికి ప్రజల సాయం

కరోనా సమయంలో వేల మందికి సేవలందించిన డాక్టర్ ఆయన. వైరస్​పై పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్ ఆ వైద్యుడు. కానీ మహమ్మారి తన మీద దాడి చేయడంతో నిస్సహాయ స్థితిలోకి వెళ్లాడు. ఆరోగ్యం క్షిణించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎదుర్కొన్నాడు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • స్కూటర్​లో చెలరేగిన మంటలు

విశాఖలో ద్విచక్రవాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్కూటర్‌ మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైట్ సిలిండర్​తో మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అంకుల్​ జీ' కామెంట్​కు స్ట్రాంగ్​ కౌంటర్

తృణమూల్ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రి వ్యాఖ్యలపై బంగాల్​ గవర్నర్​ స్పందించారు. ఎంపీ ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శత్రువులకు దీటుగా 'ఇంటిగ్రేటెడ్​ బ్యాటిల్ గ్రూప్స్'

సరిహద్దు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లకు దీటుగా బదులిచ్చేందుకు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్‌ రూపకల్పనకు నడుం బిగించిన సైన్యం.. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. కొవిడ్ మహమ్మారి, చైనాతో ఘర్షణల కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'వుహాన్ ల్యాబ్​ నుంచే కరోనా లీక్- ఇదే సాక్ష్యం...'

కరోనా వైరస్​ చైనాలోని వుహాన్​ ల్యాబ్​లోనే పుట్టిందనే వాదనలకు మరింత బలం చేకూరుతోంది. కొవిడ్‌-19 మూలలపై ఓపెన్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ఆసక్తికరమైన విషయాలు, పత్రాలను బహిర్గతం చేస్తోంది. వుహాన్‌ ల్యాబ్‌ వైరస్‌ డేటా బేస్‌ను కొవిడ్‌ వెలుగులోకి రావడానికి మూడు నెలల ముందు ఆన్‌లైన్‌ నుంచి తొలగించడాన్ని ప్రశ్నిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • స్వల్ప పెరుగుదల

పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.152 తగ్గింది. వెండి కిలో ధర రూ.70వేల మార్కును కోల్పోయింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మిగతా మ్యాచ్​ల షెడ్యూల్ ఇదే!

నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ రెండో దశ షెడ్యూల్​ ఖరారైనట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు మిగిలిన మ్యాచ్​ల్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఒక్క అభిమాని దూరమైనా భరించలేను'

బర్త్​డే రోజున తనను చూసేందుకు, కలిసేందుకు రావొద్దని అగ్రకథానాయకుడు బాలకృష్ణ అభిమానుల్ని కోరారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Last Updated : Jun 7, 2021, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details