ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM

.

TOP NEWS @ 5 PM
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Mar 4, 2021, 5:00 PM IST

  • సివిల్ జడ్జి నోటిఫికేషన్‌: 'న్యాయవాద అనుభవం అవసరం లేదు'

సివిల్ జడ్జి నోటిఫికేషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడేళ్ల న్యాయవాద అనుభవం అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సవరణతో మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని రిక్రూట్‌మెంట్‌ రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితి కనిపిస్తోంది'

విశాఖలో నారా లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమేనని యువతకు వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం

కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాను విడుదల చేసింది. విశాఖ 15వ స్థానం దక్కించుకుంది. 10 లక్షల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో తిరుపతికి రెండో స్థానం దక్కగా... 4వ స్థానంలో కాకినాడ నిలిచింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ముగిసిన వీరజవాన్ రామారావు అంత్యక్రియలు

ఉత్తర సిక్కింలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాన్​.. వంజరాపు రామారావు అంత్యక్రియలు మగిశాయి. దేశ రక్షణ కోసం అమరుడైన వీరజవాన్​కు త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై మృతి

అసెంబ్లీ ఆవరణలోనే ఓ ఎస్సై తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భద్రతా దళాల అధినేతల సదస్సుకు మోదీ

గుజరాత్​లో జరుగుతున్న దేశ భద్రతా దళాల అధిపతుల సమావేశంలోప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ప్రసంగించనున్నారు. తొలిసారి ఈ సదస్సులో జవాన్లూ పాల్గొంటున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మరోసారి స్పేస్​ఎక్స్​ విఫలం- పేలిన నమూనా రాకెట్

స్పేస్​ ఎక్స్​ సంస్థ తయారు చేసిన స్టార్​షిప్ నమూనా రాకెట్​ ప్రయోగం మరోసారి విఫలమైంది. తొలుత విజయవంతంగా ల్యాండ్​ అయినా... కొద్ది నిమిషాలకే ఆ రాకెట్​ పేలిపోయింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ధరలు మరోసారి తగ్గాయి. దిల్లీలో గురువారం 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.217 దిగొచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.1,217 తగ్గింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • స్పిన్నర్లదే పైచేయి.. ఇంగ్లాండ్​ 205 ఆలౌట్​

టీమ్ఇండియాతో జరుగుతోన్న సిరీస్​ నిర్ణయాత్మక టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​ జట్టు 205 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. భారత స్పిన్నర్లు అక్షర్​ పటేల్​, అశ్విన్​ మరోసారి ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​పై ఆధిపత్యాన్ని కొనసాగించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పూజా హెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా?

తమిళ హీరో విజయ్​ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్​గా పూజాహెగ్డే నటిస్తోంది. అయితే ఈ చిత్రం కోసం ఆమె రూ.3.5కోట్ల భారీ రెమ్యునరేషన్​ తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details