ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపాలక ఎన్నికల ప్రచారం ప్రారంభం - పురపాలక ఎన్నికల్లో ప్రచారం ప్రారంభం

ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో పురపాలక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని వైకాపా శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు గెలిపిస్తాయని తెదేపా శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Beginning of the campaign in the municipal elections
పురపాలక ఎన్నికల ప్రచారం ప్రారంభం

By

Published : Feb 25, 2021, 11:42 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో పురపాలక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెదేపా, వైకాపా నేతలు నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మున్సిపాలిటీలో 20 వార్డులు తాము గెలుస్తామని ఇరు పార్టీల అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. భాజపా-జనసేన నేతలు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థకు తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచారం ప్రారంభిస్తున్నారు. 39 డివిజన్​లో సీపీఎం తరపున పోటీ చేస్తున్న సయ్యద్ అమీర్ ఉన్నీసా ఇంటింటా ప్రచారం చేశారు. పురపాలక సంఘంగా ఉన్న సమయంలో ఈ వార్డు నుంచి తమ పార్టీ ప్రాతినిధ్యం వహించి.. ఎన్నో సమస్యలకు పరిష్కరించిందని మళ్లీ గెలిపిస్తే.. మురుగునీరు, మంచినీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details