తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శానిటైజర్ ఫైర్ అయింది. దేవీ చౌక్ సెంటర్లో ఓ వ్యక్తి తన బైక్‌ను పార్క్ చేశారు. వాహనంలో ఉన్న శానిటైజర్... ఒక్కసారిగా మండిపోయి.. మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్థంగాక సమీపంలో ఉన్న వాళ్లు పరుగు అందుకున్నారు. వాహనదారుడు స్థానికుల సాయంతో మంటలు అదుపుచేశారు.
ఇప్పుడు శానిటైజర్ ప్రతి ఒక్కరూ చేతులకు రాసుకోవడం తప్పనిసరైంది. కరోనా వ్యాప్తి కారణంగా.. పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే శానిటైజర్ చేతులకు రాసుకున్న తర్వాత మండే స్వభావం ఉన్న.. వాటి దగ్గరకు వెళ్లకపోవడమే మంచింది. శానిటైజర్లలోని ఆల్కాహాల్ కంటెంట్‌కు మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఒక్కవేళ ఆ పదార్థాన్ని బయటకు తీసుకెళ్లినా.. వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టకపోవడం ఉత్తమం. జాగ్రత్త తీసుకునే క్రమంలో.. అజాగ్రత్తగా ఉంటే.. అసలుకే ముప్పు రావచ్చు.. జాగ్రత్త.