ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ORR: రాజమహేంద్రవరానికి.. ఔటర్ రింగ్​రోడ్డు మంజూరు: ఎంపీ భరత్

ORR For Rajamahendravaram: రాజమహేంద్రవరానికి కేంద్రం ఔటర్ రింగ్‌రోడ్ మంజూరు చేసిందని ఎంపీ భరత్‌ స్పష్టం చేశారు. రూ.వెయ్యి కోట్లతో రింగ్‌రోడ్ నిర్మాణం జరగుతుందని.., ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఉత్తర్వులు అందాయన్నారు.

రాజమహేంద్రవరానికి ఔటర్ రింగ్​రోడ్డు మంజూరు
రాజమహేంద్రవరానికి ఔటర్ రింగ్​రోడ్డు మంజూరు

By

Published : Dec 27, 2021, 9:37 PM IST

ORR For Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి కేంద్రం ఔటర్ రింగ్​రోడ్డు మంజూరు చేసిందని ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం చుట్టూ 25 నుంచి 30 కి.మీ రింగ్​ రోడ్డు నిర్మాణం జరగనుందన్నారు.

రూ.వెయ్యి కోట్లతో రింగ్​ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఉత్తర్వులు అందాయని ఎంపీ భరత్‌ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరానికి రింగ్‌రోడ్ రావడం గర్వకారణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details