అమరావతిని కదపడం ఎవరికీ సాధ్యం కాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానికి అందరి దేవుళ్ల ఆశీర్వాదం ఉందని చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలు, ఐకాస నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతమందిని అరెస్టు చేసినా ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. అమరావతి కోసం ఇంటింటికీ ఓ సైనికుడు తయారుకావాలని పిలుపునిచ్చారు. అరెస్టులు చేయాలని.. కేసులు పెట్టాలని వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధాని కోసం రాష్ట్రం మొత్తం సంఘటితం కావాలని అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ప్రజలందరి నినాదం కావాలని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అమరావతిని ప్రజలంతా కాపాడుకోవాలని చంద్రబాబు కోరారు.
'అమరావతిని కదపడం ఎవరికీ సాధ్యం కాదు'
ఎంతమందిని అరెస్టు చేసినా రాజధాని పోరాటం ఆగదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి కోసం రాష్ట్ర ప్రజలంతా సంఘటితం కావాలని కోరారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ప్రజలందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు.
no-one-can-move-amaravati-says-chandra-babu