ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ కళోత్సవాలకు సర్వం సిద్ధం.. సందడి చేయనున్న వెయ్యి మంది కళాకారులు - National Cultural festival in AP

National Cultural Mahotsav: చారిత్రక, సాంస్కృతిక నగరి రాజమహేంద్రవరం జాతీయ కళోత్సవాలకు సిద్ధమైంది. జాతీయ సంస్కృతి మహోత్సవాల పేరిట ఇవాళ, రేపు జాతీయ స్థాయి కళాకారులు సందడి చేయనున్నారు. భారత దేశ సాంస్కృతిక వైభవం చాటనున్నారు. గవర్నర్ విశ్వభూషణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిసహా ప్రజా ప్రతినిధులు, దేశం నలుమూలల నుంచి కళాకారులు హాజరవుతున్నారు.

National Cultural Mahotsav in rajamahendravaram
National Sanskriti Mahotsav in rajamahendravaram

By

Published : Mar 26, 2022, 4:51 AM IST

Updated : Mar 26, 2022, 8:51 AM IST

National Cultural Mahotsav: కళలకు నిలయమైన రాజమహేంద్రవరంలో జాతీయస్థాయిలో కళాకారులు సందడి చేయనున్నారు. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతీ మహోత్సవం పేరుతో ఇవాళ, రేపు జాతీయ స్థాయి కళాకారులు సందడి చేయనున్నారు. దేశం సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సెట్టింగులు, ఆయా రాష్ట్రాల ప్రధాన కళా రూపాలు ప్రదర్శించేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఈ మహోత్సవంలో వెయ్యి మంది జాతీయ స్థాయి కళాకారులు తమ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు.

రాజమహేంద్రవరంలో జాతీయ కళోత్సవాలు

జాతీయ సాంస్కృతిక మహోత్సవాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు హాజరవుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వేడుకలను గవర్నర్ ప్రారంభిస్తారు. వేదిక వద్ద కళాకారులు చేస్తున్న సాధన ఆకట్టుకుంటోంది. ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేషధారణలతో నృత్యాలు చేస్తూ అలరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హ్యాండీ క్రాఫ్ట్స్, ఉత్పత్తుల స్టాళ్లు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చదవండి:రూ.వేల కోట్ల నిధులు.. ఎటు వెళ్లాయో తెలియడం లేదు: పయ్యావుల

Last Updated : Mar 26, 2022, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details