విశాఖ,రాజమండ్రిలో ఫలక్‌నుమాదాస్ చిత్ర యూనిట్ సందడి - rahjamaundtr
ఫలక్‌నుమాదాస్ చిత్ర యూనిట్ విజయోత్సవ పర్యటన విశాఖ, రాజమహేంద్రవరంలో సాగింది. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర హీరో విశ్వక్ సేన్ ధన్యవాదాలు తెలిపారు.
విశాఖ,రాజమహేంద్రవరంలో ఫలక్‌నుమాదాస్ చిత్రయూనిట్
ఇటీవల విడుదలైన చిత్రం ఫలక్‌నుమాదాస్ చిత్ర యూనిట్ విజయోత్సవ పర్యటన విశాఖతో పాటు రాజమహేంద్రవంలో సాగింది. చిత్ర హీరో విశ్వక్ సేన్ విశాఖలోని సంగమ్ థియేటర్లో ప్రేక్షకులను కలుసుకుని సినిమా విజయానికి తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉందని ఆనందం వ్యక్తం చేశారు.