పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం ఆమోదం మేరకు నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ రాజమహేంద్రవరంలో డిమాండ్ చేశారు. కేంద్రంపై రాజకీయ పక్షాలు ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అన్యాయాన్ని పక్కన పెట్టి... విగ్రహం ఏర్పాటుపై చర్చ చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు.
ఈ నెల 26న పోలవరం పరిరక్షణ యాత్ర కొనసాగిస్తామని... యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే, విమానం, బీఎస్ఎన్ఎల్, అంతరిక్ష పరిశోధనలతోపాటు అన్నింటినీ కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు. వ్యవసాయం కూడా ప్రైవేటు పరం చేస్తారా అంటూ రామకృష్ణ ప్రశ్నించారు. 26న దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తుందని రామకృష్ణ అన్నారు.