వరద బాధితుల సహాయ చర్యల్లో తెదేపా కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలు, ముంపు మండలాల్లో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని తెదేపా అధినేత విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ లేక, తాగునీటి కొరతతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన చెందారు.
పొలాల్లోకి వరద నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని... మిర్చి, అరటితోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. తెదేపా కార్యకర్తలు ముందుకొచ్చి వరద బాధితులకు అండగా ఉండాలని.... సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. మానవ సేవే మాధవ సేవగా భావించాలని... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వరద బాధితులకు అండగా ఉండండి : చంద్రబాబు - victims
వరద బాధితులకు సాయం చేయాలని తెదేపా కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
చంద్రబాబు
ఇదీ చదవండి