నెల్లూరు నగరంలోని కొండాయిపాలెం రోడ్డులో ఉన్న జనహిత వాత్సల్య ప్రాంగణం.. 35ఏళ్లుగా అనేక మంది దాతలు సహకారంతో కొనసాగుతోంది. ఈ నిధుల సహాయంతో నిరాదరణకు గురైన చిన్నారులకు విద్యాబోధన, వృద్ధాశ్రమం, దేవాలయం నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. ఆడపిల్లలకు వివాహం కూడా చేయిస్తున్నారు. సంగమేశ్వర శాస్త్రి స్థాపించిన ఈ ప్రాంగణంలో చదువుకున్న వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థిరపడ్డారు.
VATSALYA : నిరాదరణకు గురైన చిన్నారులకు ఆశ్రయం... వాత్సల్య ప్రాంగణం... - nellore latest news
నిరాధరణకు గురైన చిన్నారులను చేరదీసి, విద్యాబుద్ధులు నేర్పించే ఆశ్రమం అది. జీవితంపై ఆశ కల్పించి, సమాజంలో ఎలా మెలగాలో నేర్పించే వేదిక అది. ఈ ఆశ్రమంలో చదువుకున్న ఎందరో... పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ఇంతకీ ఆ ఆశ్రమం ఏమిటి..?, ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా.. ? అయితే ఈ కథనం చదివేయండి మరి...
నిరాదరణకు గురైన చిన్నారులకు ఆశ్రయం... వాత్సల్య ప్రాంగణం...
వాత్సల్య నిర్వాహకులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించకుండా... కేవలం దాతలు ఇచ్చే నిధులతో ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఈ ప్రాంగణంలో 130మంది ఆశ్రయం పొందుతున్నారు. వారి చదువుకు అయ్యే ఖర్చును సైతం ఆశ్రమం నిర్వాహకులే భరిస్తున్నారు. తల్లితండ్రులు లేరనే భావన రాకుండా అందరినీ సమానంగా చూస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీచదవండి.