ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా భయంతో.. అడవిలోకి గిరిజనులు! - tribals went in to forest in fear of corona

కరోనా భయంతో నెల్లూరు జిల్లా వెంకటగిరి, బొగ్గులమిట్టల్లోని గిరిజనులు అటవీ ప్రాంతోకి తరలి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న నెల్లూరు కోర్టుకు చెందిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వారితో మాట్లాడి.. వారు తరిగి ఇళ్లకు తిరిగి వచ్చేందుకు ఒప్పించారు.

people went into forest in fear of corona spread at nellore district
కరోనా భయంతో అడవిలోకి గిరిజనులు

By

Published : May 20, 2021, 10:48 AM IST

కరోనా భయంతో నెల్లూరు జిల్లా వెంకటగిరి, బొగ్గులమిట్టకు చెందిన గిరిజనులు వెలిగొండ అటవీ ప్రాంతంలోని కోన మల్లేశ్వరస్వామి కోనకు తరలివెళ్లారు. వీరిలో 10 కుటుంబాలకు చెందిన పెద్దలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులు కలిపి.. 70 మంది దాకా ఉన్నారు. సమాచారం అందుకున్న నెల్లూరు కోర్టుకు చెందిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.జె. ప్రకృతికుమార్‌ బుధవారం కోనకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు.

తామంతా కరోనా భయంతో ఊరు వదిలి అడవికి వచ్చేశామని వారు ఆయనకు తెలిపారు. నాలుగు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు తీసుకువచ్చామని, తీరా అవి రెండు రోజులకే అయిపోయాయని తెలిపారు. ఏపీపీ మాట్లాడుతూ ధైర్యంగా ఇళ్లలోనే ఉండాలని, ఇలా అడవికి రావడం ప్రమాదకరమని వివరించారు. ఇళ్లకు వెళ్తే తామే నిత్యావసర సరకులను అందిస్తానని హామీ ఇచ్చారు. వాహన సౌకర్యం కూడా కల్పిస్తామనడంతో.. గిరిజనులు తమ ఇళ్లకు వెళ్లేందుకు అంగీకరించారు.

ABOUT THE AUTHOR

...view details