నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 43వ డివిజన్ జండా వీధి వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పీఎన్ఎం పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సర్వేను పరిశీలించేందుకు వచ్చిన తెదేపా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్‌ను వైకాపా శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం(tension between tdp and ycp at nellore) చేశారు. పోలీసులు చెబుతున్నా లెక్కచేయకుండా వైకాపా కార్యకర్తలు గేట్లను నెట్టుకుంటూ తెదేపా వర్గాలపైకి వెళ్లారు.
tension at nellore: నెల్లూరులో తెదేపా వైకాపా శ్రేణుల మధ్య ఉద్రిక్తత
నెల్లూరు నగరపాలక సంస్థ 43వ డివిజన్ జండా వీధిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట(tension between tdp and ycp at nellore) జరిగింది. ఎన్నిక సర్వే పరిశీలనకు వచ్చిన తెదేపా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్‌ను వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నెల్లూరులో తెదేపా వైకాపా శ్రేణుల మధ్య ఉద్రిక్తత
పోలింగ్ కేంద్రం సమీపంలోకి వచ్చే అధికారం తెదేపా జిల్లా అధ్యక్షుడికి లేదని వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. గొడవ తీవ్రం కావడంతో పోలీసులు మోహరించారు. గొడవ సద్దుమనిగింది.
ఇదీ చదవండి..:TDP COMPLAINT: దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ.. ఎస్ఈసీకి ఫిర్యాదు
TAGGED:
tension at nellore